గర్భిణీలకు అండగా విజయలక్ష్మి ఫౌండేషన్

గర్భిణీలకు అండగా విజయలక్ష్మి ఫౌండేషన్

తాండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా శ్రీమంత కార్యక్రమాలు

కంచర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు

 విజయలక్ష్మి

*తాండూర్ అక్టోబర్ 2 తెలంగాణ వార్తా ప్రతినిధి* 

  తాండూర్ మండలంలోని వీరారెడ్డిపల్లె, రాంపూర్, చంద్రవంచ గ్రామాల్లో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణీ మహిళలకు శ్రీమంత కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ నిర్వాహకురాలు కంజర్ల విజయలక్ష్మి గడప గడపకు వెళ్లి గర్భిణీ మహిళలను పరామర్శించి, సంప్రదాయబద్ధంగా శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. గర్భిణీ మహిళలకు అవసరమైన సమయంలో కుటుంబ సభ్యులతో పాటు సమాజం కూడా అండగా నిలవాలని విజయలక్ష్మి సూచించారు.కార్యక్రమాల్లో ఆయా గ్రామాల పెద్దలు, నాయకులు, సంగం పండరి, రమేష్ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గర్భిణీ మహిళలను ఆశీర్వదించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు