తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ నియామకం.!

తెలంగాణ వార్త: శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన కుమారుడు శ్రీకాంతచారి 2009 మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందన్నారు.

మహిళల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మహిళా కమిషన్ ద్వారా తన వంతు సేవలు అందిస్తానని శంకరమ్మ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.