తెలంగాణ వార్త : బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.
పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, రాబోయే రాజకీయ కార్యక్రమాలపై విస్తృత చర్చ ..
పార్టీ బలోపేతం, స్థానిక స్థాయిలో కార్యకర్తల సమన్వయంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు..
ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత టి. హరీష్ రావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీవన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర కీలక నాయకులు పాల్గొన్నారు.
