తాండూరు 13th May ( తెలంగాణ వార్త) : తాండూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
నియోజకవర్గ పర్యటనలో భాగంగా అంతారం తండా నుండి వస్తున్న సమయంలో మల్ రెడ్డి పల్లి రహదారి పక్కన కూర్చొని సహాయం కోరుతున్న ఓ దివ్యాంగ మహిళను గమనించిన ఎమ్మెల్యే గారు వెంటనే తన వాహనాన్ని ఆపి ఆమె వద్దకు వెళ్లి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఆ మహిళ తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కల్పించాలని ఎమ్మెల్యే గారిని కోరింది. ఆమె సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హత ప్రకారం దివ్యాంగ పింఛన్ మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ, ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి సేవాభావాన్ని స్థానిక ప్రజలు అభినందించారు.
