పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు సువర్ణావకాశం:తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాతుల నాగరాజ్..

తాండూరు (ఆగస్ట్ 29th 2026) : నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న SI, కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ తరగతులను తాండూరు ప్రాంతంలోని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగరాజ్ కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు మెరుగైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఉచిత కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.

ఉచిత కోచింగ్ తరగతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 31-08-2026 వరకు కొనసాగుతుందని తెలిపారు.

రిజిస్ట్రేషన్ కోసం SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన పత్రాలు, ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్, డిగ్రీ మెమోల జిరాక్స్ కాపీలతో తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు.

తాండూరు నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా ఈ ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాతుల నాగరాజ్ కోరారు.