హార్మొనీ వుడ్స్‌పై తప్పుడు ప్రచారం సహించేది లేదు:సంస్థ ప్రతినిధులు.!

హైదరాబాద్ ( 21st సెప్టెంబర్ 2026) : మహేశ్వరం మండలం తుమ్మలూరులో జేబీ ఇన్‌ఫ్రా, భువన్ ఇన్‌ఫ్రా, కాంక్రీట్ ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న హార్మొనీ వుడ్స్ ప్రాజెక్టుపై కొందరు తప్పుడు సమాచారంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

సర్వే నంబర్లు 371, 372, 373, 377లోని భూమిని 2018లో పూర్తి టైటిల్ పరిశీలన అనంతరం కొనుగోలు చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది. తమ కొనుగోలుకు ముందే సంబంధిత భూమిపై ఐదు లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. 2018లో భూమి కొనుగోలు జరిగిన సమయంలో రాష్ట్రంలో BRS ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయాన్ని సంస్థ ప్రతినిధులు గుర్తుచేశారు.

హార్మొనీ వుడ్స్ RERA రిజిస్టర్డ్ ప్రాజెక్టు అని, సంబంధిత అనుమతులు మరియు నిబంధనలకు అనుగుణంగానే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ప్రాజెక్టు, సంస్థలు మరియు వాటి ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు, నిరాధార ఆరోపణలు లేదా ప్రచారం కొనసాగిస్తే, సంబంధిత వ్యక్తులపై పరువు నష్టం దావాతో పాటు వర్తించే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.