బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ ఫ్లెక్సీతో నేతాజీ విగ్రహానికి అవమానకర పరిస్థితి..!

తాండూరు ( సెప్టెంబర్ 16th 2026): తాండూరు పట్టణంలోని శాంతుమహల్ చౌరస్తాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం చుట్టూ వినాయక చవితికి సంబంధించిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ తదితర రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

విగ్రహం స్పష్టంగా కనిపించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ వంటి మహనీయుడి విగ్రహం వద్ద రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా స్థలాల్లో రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మహనీయుల విగ్రహాల గౌరవాన్ని, పరిసరాల పరిశుభ్రతను, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నేతాజీ విగ్రహం ముందు రాజకీయ ప్రచారం అవసరమా? మహనీయుడి విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సమంజసమేనా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

తక్షణమే ఫ్లెక్సీలను తొలగించి, నేతాజీ విగ్రహానికి గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.