పేదల ఇంటి కలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

తాండూరు (25 సెప్టెంబర్ 2026 ): తాండూరు మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో నూతనంగా నిర్మించిన సగ్గెం ఇందిర–నారాయణ ఇందిరమ్మ ఇల్లు, 27వ వార్డులో నూతనంగా నిర్మించిన రజియా బేగం–దస్తగిర్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారులను ఎమ్మెల్యే అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

తమ సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ కుటుంబానికి సొంతింటిని అందించిన ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.