హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGHCL) కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మరియు రెవెన్యూ సమస్యలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు , స్పీకర్ గడ్డం ప్రసాద్ , ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఈటెల రాజేందర్ , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి…
ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా జిల్లాల కలెక్టర్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
