ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం – బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్..!

తాండూరు 13th May ( తెలంగాణ వార్త) : ఈ రోజు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల్లో పదవులను అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పార్టీ పదవులుగా మార్చిందని బీజేపీ 23వ వార్డ్ కౌన్సిలర్ అంతారం కిరణ్ విమర్శించారు.

కో-ఆప్షన్ నియామకాలలో కూడా ఒకే వర్గానికి, ముఖ్యంగా ముస్లింలకే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో వైస్ చైర్మన్ పదవులు, మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు కూడా ముస్లింలకే దక్కుతున్నాయని అన్నారు.

మైనారిటీలు అంటే కేవలం ముస్లింలేనా..? క్రైస్తవులు మరియు ఇతర మైనారిటీ వర్గాలు లేరా అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఒకే వర్గానికి కొమ్ముకాసే కుటిల రాజకీయాలను ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరారు.

ప్రజా వ్యతిరేక విధానాలను భారతీయ జనతా పార్టీగా ఎప్పటికప్పుడు ఎండగడతామని, తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు..