భోపాల్ మే 15 (తెలంగాణ వార్త) : వివాదాస్పద భోజ్శాల-కమల్ మౌలా కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భోజ్శాల ఒక ఆలయమని స్పష్టం చేస్తూ జైన్, ముస్లిం వర్గాల పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. హిందువులకు అక్కడ పూజలు నిర్వహించే హక్కు ఉందని హైకోర్టు పేర్కొంది.
భోజ్శాలను వాగ్దేవి అమ్మవారి ఆలయంగా గుర్తించిన న్యాయస్థానం, అక్కడ నమాజ్‌కు అనుమతి ఇచ్చిన గత ఉత్తర్వులను రద్దు చేసింది. పురావస్తు శాఖ (ASI) సమర్పించిన నివేదిక ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్లు ప్రకటించారు.
భోజ్శాల-కమల్ మౌలా స్థలంపై చాలా ఏళ్లుగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజా తీర్పుతో ఈ అంశం మరోసారి జాతీయస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.
