తెలంగాణ 15th May (తెలంగాణ వార్త) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 రీఎగ్జామ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది.
వచ్చే నెల జూన్ 21న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
కొన్ని కేంద్రాల్లో సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల పరీక్ష నిర్వహణలో ఏర్పడిన సమస్యల నేపథ్యంలో రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
రీఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. విద్యార్థులు అధికారిక ప్రకటనలను నిరంతరం పరిశీలించాలని సూచించింది.
దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
