జన్మదినాన్ని జనసేవగా మార్చిన యువ నాయకుడు బుయ్యని శివ కుమార్ రెడ్డి

తాండూర్ మే 29 : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనయుడు బుయ్యని శివ కుమార్ రెడ్డి  జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాతుల నాగు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని  మాత శిశు హాస్పిటల్‌ లో రోగులు, వారి కుటుంబ సభ్యులకు అల్పాహార పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ, యువ నాయకుడు బుయ్యని శివ కుమార్ రెడ్డి సేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని బుయ్యని శివ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.