‘రైతు డిస్కం’ పేరుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు చేస్తాం – కేటీఆర్..!

హైదరాబాద్, మే 28: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ పేరుతో చేపడుతున్న చర్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రైతాంగం మరియు రాష్ట్ర విద్యుత్ రంగ భవిష్యత్తుకు హానికరంగా మారే ఈ నిర్ణయాలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

రేపు ఉదయం 10 గంటలకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పాల్గొని ప్రజల తరఫున తమ వాదనలను వినిపించనుంది.

‘రైతు డిస్కం’ ప్రతిపాదనల వల్ల తెలంగాణ రైతాంగంపై పడే ఆర్థిక భారం, విద్యుత్ రంగంపై ఏర్పడే ప్రతికూల ప్రభావాలు, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఏ నిర్ణయాన్నైనా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ స్పష్టం చేసింది.