తాండూరు, సెప్టెంబర్ 30 ( తెలంగాణ వార్త ప్రతినిధి): పదేళ్లుగా ఎదురుచూస్తున్న జినుగుర్తి గ్రామ ప్రజల విద్యుత్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో గ్రామానికి త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు త్రీ-ఫేజ్ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రైతులు, గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గ్రామ సర్పంచ్ ఎం. శరణమయ్య తెలిపారు. గ్రామ ప్రజల దీర్ఘకాలిక సమస్యను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సమస్య పరిష్కారానికి ఆయన ప్రత్యేక చొరవ చూపారని పేర్కొన్నారు.పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించి గ్రామానికి త్రీ-ఫేజ్ కరెంట్ అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ శరణమయ్య కృతజ్ఞతలు తెలిపారు.
సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు ధన్యవాదాలు
తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జినుగుర్తి గ్రామ సమస్యను ప్రస్తావించిన సర్పంచ్ ఎం. శరణమయ్య.. గ్రామానికి త్రీ-ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడంలో సహకరించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల అవసరాలను గుర్తించి, ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు. త్రీ-ఫేజ్ విద్యుత్ అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రజలకు మరింత ప్రయోజనం కలగనుందని తెలిపారు.
