తాండూరులో డాక్టర్స్ డే వేడుకలు – వైద్యులను సన్మానించిన బుయ్యని దంపతులు..!

తాండూరు  ( జులై 1) : ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా తాండూర్ నియోజకవర్గానికి చెందిన వైద్యులను RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి , బుయ్యని సరళా రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి వారి సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా బుయ్యని దంపతులు మాట్లాడుతూ, “వైద్యో నారాయణో హరిః” అనే నానుడికి తగ్గట్టుగానే వైద్యులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ప్రాణాలను రక్షించే దైవస్వరూపులుగా సేవలందిస్తున్నారని అన్నారు. వైద్యుల అంకితభావం, సేవా స్పూర్తి సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.

తాండూర్ నియోజకవర్గంలోని వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవలు మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందాలని ఆకాంక్షించారు. వైద్యుల కృషి సమాజానికి ఆదర్శంగా నిలిచి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు.