రూ.2.38 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన-ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి..!

తాండూరు 15th May ( తెలంగాణ వార్త) : తాండూరు నియోజకవర్గంలోని యాలాల్ మండలం కోకట్ గ్రామ పరిధి నుండి సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు రూ.2.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సంగమేశ్వర స్వామి దేవాలయం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దేవాలయానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడేందుకు ఈ సీసీ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.