దిశ సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..!

వికారాబాద్ జిల్లా ( 23rd సెప్టెంబర్2026 ): వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, అధికారుల పనితీరు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతిని, ప్రభుత్వ పథకాల అమలును అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని సమావేశంలో చర్చించారు.

ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ , జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహరా , దిశ కమిటీ సభ్యులు వడ్ల నందు, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, జానకిరామ్ నాయక్, అంటారం లలితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.