తాండూరు, జూన్ 16: నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన విద్యుత్ సరఫరా సమస్యలపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర సమస్యలను వెంటనే గుర్తించి, అత్యవసర చర్యల ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండి, ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రజల సంక్షేమం, రైతుల అవసరాల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
