యాలాల్ మండలం 25 జూన్ : యాలాల్ మండలం జక్కేపల్లి గ్రామంలోని బూత్ నంబర్ 205 వద్ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారుల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు అందజేసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్వయంగా ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తన ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పులు లేదా తొలగింపుల కోసం ఫారాలను సక్రమంగా నింపి సంబంధిత అధికారులకు సమయానికి అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో SIR నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రావు, BLO షమీ బేగం, BLA రామకృష్ణ, AMC చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మండల అధ్యక్షులు మహిపాల్, అమృతప్పతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
