గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం

తాండూరు, అక్టోబర్ 2:  (తెలంగాణ వార్త ప్రతినిధి)జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తాండూరు మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిరిగిరి పెట్  పండరి ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా  గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ సిరిగిరి పెట్  పండరి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామసభ నిర్వహించి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.గ్రామసభలో మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, పరిశుభ్రత, గ్రామ స్వరాజ్యం వంటి ఆశయాలను ప్రజలు తమ జీవితాల్లో ఆచరించాలని సర్పంచ్  పండరి సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అలాగే వి.బి.జి. రామ్‌జీ కార్యక్రమంపై గ్రామస్తులకు అవగాహన  కల్పించిన ఉపాధిహామీ సిబ్బంది .గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో   గ్రామ ఉపసర్పంచ్ జగదీష్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి  ఇస్మాయిల్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.